కన్నడ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంలో నటి సంజనాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ కి గురైంది. విచారణ నిమిత్తం మంగళవారం సంజనాని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం ఇందిరా నగర్‌లోని నటి ఇంట్లో సీసీబీకి చెందిన అధికారులు సోదాలు జరిపి, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. న్యాయస్థానం నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న తర్వాతే సంజన ఇంట్లో సోదాలు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో సంజన స్నేహితుడు రాహుల్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత నుంచి అందరి దృష్టి ఆమెపై పడింది. తరుణ్ హీరోగా నటించిన ‘సోగ్గాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంజనా… అనంతరం ‘బుజ్జిగాడు’, ‘యమహో యమ’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో నటించింది.