రివ్యూ: MMOF

నటీనటులు: జేడీ చక్రవర్తి, సాయి అక్షత, బెనర్జీ, అక్షిత ముద్గల్ తదితరులు
సంగీతం: సాయి కార్తిక్
సినిమాటోగ్రఫర్: గరుడవేగ అంజి
ఎడిటర్: ఆవుల వెంకటేష్
దర్శకుడు: NSC

ఒకప్పుడు ఎన్నో సంచలన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో జేడీ చక్రవర్తి చాలా రోజుల తర్వాత కొత్త సినిమాతో వచ్చాడు. ఈయన నటించిన MMOF/70MM సినిమా ఫిబ్రవరి 26న థియేటర్‌లోకి వచ్చింది. మరి అది ఎలా ఉంది..? ఎంతవరకు ఆకట్టుకుంది..?

కథ:
దీపక్ ఖార్ఖాన సెంటర్‌లో ఓ ధియేటర్ ఓనర్.. వాళ్ళ నాన్న గారి చేసిన అప్పులతో ఆస్తులన్ని పోయి ఒక్క థియేటర్ మాత్రమే మిగులుతుంది. చివరికి అదే వాళ్ల ఇల్లు అవుతుంది. నాన్న చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి గత్యంతరం లేక ఆ థియేటర్‌లో సెక్స్ సినిమాలు ఆడిస్తూ జీవతం నడిపిస్తుంటాడు. అయితే సడన్ గా ఆ థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది చచ్చిపొతుంటారు. వాళ్ళు అలా ఎందుకు చచ్చిపోతున్నారు.. వాళ్ళని ఎవరైనా మర్డర్ చేసారా..? అసలు ఆ థియేటర్ లో ఏముంది..? ఆ సమస్యల నుంచి దీపక్ ఎలా బయట పడ్డాడు అనేది అసలు కథ..

నటీనటులు:
జేడీ చక్రవర్తి తన పాత్రలో ఒదిగిపోయాడు.. సినిమా అంతా తానేయై నడిపించాడు. ఎటువంటి కమర్షియల్ అంశాలు ఆశించకుండా పూర్తిగా కథను నమ్మి చేసినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా. జేడీ తర్వాత చెప్పుకోదగ్గ పాత్రలో బెనర్జీ నటించారు. థియేటర్ ఆఫరేటర్ పాత్రలో అందర్నీ ఆకట్టుకుంటాడు. చాలా రోజుల తర్వాత అతనికి కూడా నటించడానికి మంచి స్కోప్ వున్న పాత్ర దొరికింది. జేడీ చెల్లెలుగా నటించిన అక్షిత ముద్గల్ కూడా కూడ తన నటనతో ఆకట్టుకుంది. కిరాక్ ఆర్పీ.. చమ్మక్ చంద్ర కాసేపు నవ్విస్తారు. జేడీ భార్యగా నటించిన సాయి అక్షత కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కాకపోతే కొంచెం మేకప్ ఎక్కువైందేమో అనిపించింది. సింగర్ శ్రీ రాంచంద్ర ఒక ఇంపార్టెంట్ రోల్ చేసాడు. అతడి నటన కూడా ఫర్వాలేదు అనిపించింది. ప్రతినాయకుడిగా నటించిన రాజుభాయ్ బాగున్నాడు. మనోజ్ నందన్‌ను సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది.

కథనం:
దర్శకుడు రాసుకున్న మంచి కథకు కథనం మాత్రం సరిపోలేదు. స్క్రీన్ ప్లే లోపాలు కనిపించాయి కథలో. తొలి 10 నిమిషాలు ఆసక్తికరంగా నడుస్తున్న సినిమా తర్వాత అవసరం లేని సీన్లు పెట్టి కొంచెం గందరగోళానికి గురి చేసినట్లు అనిపిస్తుంది. మళ్లీ ఇంటర్వెల్ ముందు 15 నిమిషాల నుంచి ఇంట్ర్వెల్ బాంగ్ వరకూ గ్రిప్పింగ్‌గా నడిపించాడు. ఇంట్ర్వెల్ తర్వాత కొంత తడబడినా.. మళ్ళీ గాడిలో పడి క్ల్యెమాక్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్ళి పాస్ అయిపోయాడు. తను అనుకున్న పాయింట్ మీద ఇంకా బాగా వర్క్ చేసుంటే సినిమా రేంజ్ మరింత పెరిగి ఉండేది. కచ్చితంగా ఆయన అనుకున్న స్థాయి అందుకుని ఉండేది. కానీ అలా జరగలేదు. స్క్రీన్ ప్లే లోపాలతో సినిమా అక్కడక్కడా తేలిపోయింది.

టెక్నికల్ టీం:
ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఇచ్చిన సాయికార్తిక్ పనితీరు మెచ్చుకోకుండా ఉండలేరు. ఓ రకంగా సినిమాకు ప్రాణం పోశాడు ఈయన. సౌండ్ డిజైన్ బాగుంది. కెమెరామెన్ గురడవేగ అంజి పనితనం బాగుంది. మాటలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. మాస్‌ ఆడియన్స్‌కు కావాల్సిన మసాలా కూడా ఉంది. సినిమా చేస్తే బిట్ సినిమాలు కూడా గుర్తొచ్చాయి అంటారు. దర్శకుడు చెప్పిన కథలో ఓ మంచి అంశం ఉంది. దేనికి అడిక్ట్ కాకూడదని.. ముఖ్యంగా యూత్.

చివరగా:
ఓవరాల్‌గా ఈ సినిమా మిమ్మల్ని డిస్ప్పాయింట్ చేయదు.. నిర్మాతలు తొలి ప్రయత్నంగా ఓ మంచి కథను చిన్న బడ్జెట్‌లో చెప్పారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here