“బుట్ట బొమ్మ” కు మరో అరుదైన రికార్డు..

ఈ ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అల వైకుంఠపురములో”. ఇది బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి మరో ముఖ్య కారణం థమన్ అందించిన సంగీతం కూడా ఒకటి అని చెప్పాలి. తాను కొట్టిన ప్రతీ ఒక్క పాట కూడా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. దీనితో ఈ సినిమా ఆడియో ఆల్బమ్ భారీ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా అన్ని పాటల్లోనూ విజువల్ గా హిట్ అయిన సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది “బుట్ట బొమ్మ” సాంగ్ అని చెప్పాలి. ఈ సాంగ్ మొత్తం ఎల్లలను చేరిపేసింది. మొన్ననే మన తెలుగులోనే హై హెస్ట్ వ్యూడ్ వీడియో సాంగ్ గా రికార్డ్ నెలకొల్పింది.

ఇప్పుడు మళ్లీ ఇదే సాంగ్ మన తెలుగులో ఫాస్టెస్ట్ 2 మిలియన్ లైక్స్ సంపాదించిన సాంగ్ గా మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ పాట రచించిన రామ జోగయ్య శాస్త్రి ఆర్మాన్ మాలిక్ గొంతు జానీ మాస్టర్ కొరియోగ్రాఫి ఈ సాంగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాయని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here