చిరు సినిమాలో రష్మిక..?

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలోనే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సినిమాలన్నీ తిరిగి సెట్స్ పైకి వస్తోన్న తరుణంలో.. మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఆచార్య’లో క్యూట్ గర్ల్ రష్మిక మందన నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే రష్మిక పాత్ర కేవలం పది నిమిషాల నిడివి మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెర్రీకి జోడిగా రష్మికను తీసుకోనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here