పవర్ ప్లే సినిమా రివ్యూ

కాస్ట్ – రాజ్ తరుణ్,హేమల్, పూర్ణ, ప్రిన్స్, కోట శ్రీనివాస రావ్, అజయ్, రాజా రవీంద్ర, పూజా రామచంద్రన్, కేడర్ శంకర్, అప్పాజీ, సత్యం రాజేష్, రవి వర్మ, ధన్ రాజ్, వేణు, భూపల్, మధునందన్, డి .డి శ్రీనివాస్, గగన్ విహారి
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – విజయ్ కుమార్ కొండా
ప్రొడ్యూసర్స్ – మహిధర్ అండ్ దేవేష్

కథ:

ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన విజయ్ (రాజ్ త‌రుణ్‌) తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అయితే ఉద్యోగం లేకపోవడంతో అమ్మాయి తండ్రి పెళ్లికి నిరాక‌రిస్తాడు. దాంతో.. విజ‌య్ తండ్రి త‌న ఉద్యోగానికి వాలంట‌రీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించి, ఆ ఉద్యోగం త‌న కొడుకుకి వ‌చ్చేలా చేస్తాడు. దింతో ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి జరుగుతుందనే సంతోషంలో ఉంటాడు హీరో. సరిగ్గా అప్పుడే అనుకోకుండా ఓ సిట్యూవేషన్ ఎదురవుతుంది. ఈ దెబ్బకి ఒక్క రోజులోనే త‌న సంతోషాల‌న్నీ దూరం అవుతాయి. తన జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎవరు, అసలు ఎందుకు ఇదంతా చేయాలి, ఈ పరిస్థితిని హీరో ఎలా ఎదుర్కున్నాడనేది అసలు కథ.

విశ్లేష‌ణ‌:

అనవసరమైన పాటలు, వెకిలి కామెడీ సన్నివేశాలు లేకుండా.. కేవలం కథ మాత్రమే ఉండేలా ఈ సినిమా చేశాడు..ఈ క్రమంలో కాస్త సక్సెస్ అయ్యాడు కూడా..ఇలాంటి సినిమాల‌కు రేసీ స్క్రీన్ ప్లే చాలా అవ‌స‌రం. అది ప‌వ‌ర్‌ప్లేకి బాగా కుదిరింది. ప్ర‌తి పాత్ర‌నీ వాడుకున్న విధానం, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్.. ఇవ‌న్నీ ప‌వర్ ప్లేకి బ‌లాలుగా మారాయి. తెర‌పై ఓ హీరో ఎప్పుడూ క‌నిపించ‌డు. మ‌న‌లో ఒక‌డైన సామాన్యుడే క‌నిపిస్తాడు. ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నుంచి వచ్చిన సినిమాల్లో బెటర్ .

న‌టీన‌టులు:

రాజ్ త‌రుణ్ మొదటిసారి థ్రిల్లర్ నేపథ్యంలో కథను ఎంచుకున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కి నటన శైలికి థ్రిల్లర్ స్టోరీ చక్కగా సూట్ అయ్యింది.పూర్ణ అద్భుతంగా న‌టించింది. ఆమెకు ఇది మ‌రో మెట్టు. మ‌ధునంద‌న్‌, ధ‌న్ రాజ్‌.. వీళ్లంతా సీరియ‌స్ గా త‌మ పాత్ర‌ల్ని చేసుకుంటూ వెళ్లిపోయారు. చాలా కాలం త‌ర‌వాత కోట‌శ్రీ‌నివాస‌రావు ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించారు.

సాంకేతిక విభాగం :

ఆండ్రూ కెమెరా ఈ సినిమాకి ప్ర‌ధాన‌ బ‌లం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సురేష్ బొబ్బిలి నేప‌థ్య సంగీతం బాగుంది. దర్శ‌కుడు ఓ సరికొత్త తరహా సినిమాని అందించాలని చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవచ్చు.

ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: థ్రిల్లర్ అభిమానులను మెప్పించే పవర్ ప్లే .

రేటింగ్ : 3.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here