‘చకోరి’ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన నా చెలివే సాంగ్ విడుదల..

నోయల్ సీన్, మెహబూబ్, సుమీత బజాజ్ ప్రధాన పాత్రల్లో ఆష్టా సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సత్య ధానేకుల దర్శకత్వంలో దేవు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా చకోరి. ఈ చిత్రం నుంచి తాజాగా నా చెలివే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా.. నోయల్ సీన్, మెహబూబ్ అందులో కనిపించారు. లీండర్ లీ మార్టీ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్రన్ ఈ పాటకు సాహిత్యం అందించారు. తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మాయ చేసారు సిద్ శ్రీరామ్. నా చెలివే అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్రాంతి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న చకోరి సినిమాకు ప్రశాంత్ నీలం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

నటీనటులు:
నోయల్ సీన్, మెహబూబ్, సుమీత బజాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: సత్య ధానేకుల
నిర్మాత: దేవు సత్యనారాయణ
నిర్మాణ సంస్థ: ఆష్టా సినీ క్రియేషన్స్
సంగీతం: లీండర్ లీ
ఎడిటర్: క్రాంతి
సినిమాటోగ్రఫర్: ప్రశాంత్ నీలం
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here