హైయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన మెహబూబ్ దిల్ సే వెబ్ సిరీస్ ‘గుంటూర్ మిర్చి’..

యూ ట్యూబ్ స్టార్, బిగ్ బాస్ 4 తెలుగు ఫేమ్ మెహబూబ్ దిల్ సే హీరోగా గుంటూర్ మిర్చి అనే వెబ్ సిరీస్ మొదలైంది. ఇప్పటికే విడుదలైన మొదటి ఎపిసోడ్‌కు యూ ట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటి వరకు తెలుగులో మరే వెబ్ సిరీస్‌కు పెట్టనంత భారీ బడ్జెట్ పెట్టారు. అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన వెబ్ సిరీస్ గుంటూర్ మర్చి. హై యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమాకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. న్యాయం కోసం పోరాడే ఓ బాధ్యతాయుతమైన కొడుకు కథ గుంటూర్ మిర్చి.

ఇప్పుడు జనాల్లో బాగా నానుతున్న రైతుల బాధలు, వాళ్ల సమస్యల చుట్టూ ఈ కథ సాగుతుంది. మెహబూబ్ దిల్ సే ఈ వెబ్ సిరీస్‌లో మాస్ హీరోగా కనిపించాడు. అవసరం అయిన ప్రతీసారి తన హీరోయిజం బయటికి తీసుకొచ్చాడు. గుంటూర్ మిర్చి ఇప్పటికే విడుదలైంది. తాజాగా విడుదలైన మొదటి ఎపిసోడ్ యూ ట్యూబ్ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. యూ ట్యూబ్‌లో మీరు కూడా ఈ యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here