సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ సుస్మిత

చిరంజీవి కూతురు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు.ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న ఆమె తాజాగా నిర్మాతగా మారుతున్నారు. ముందుగా వెబ్ సిరీస్ ప్రారంభిస్తున్నారు సుస్మిత

అందరు అనుకున్నట్లుగానే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మెగా డాటర్ సుస్మిత. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత గతకొన్ని రోజులుగా నిర్మాతగా మారుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేసేలా ఆమె ముందుకు వచ్చారు. సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా తన తండ్రి చిరంజీవి కి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూ మంచి మార్కులు కొట్టేశారు. సైరా, ఇంద్ర వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.

తాజాగా వెబ్ సిరీస్ పనుల్ని సుశ్మిత ప్రారంభించారు. పూజా కార్యక్రమాల తో మెగాస్టార్ సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలయ్యింది. మొదట గా ఓ వెబ్ సిరీస్ ద్వారా ఈ ప్రొడక్షన్ హౌస్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టనుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ హవా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. దీంతో సుస్మిత ఈ రంగంలో సక్సెస్ అవుతారని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్స్, పోలీసులకు మధ్య జరిగిన నిజ ఘటనలకు సంబంధించిన కథనాలతో ఈ వెబ్ సిరీస్ రూపొందించనున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ఆనంద్ రంగా ఇంతక ముందు ‘బొమ్మరిల్లు’ సిద్దార్థ్ తో ”ఓయ్” అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాలకి స్క్రీన్ ప్లే రైటర్ గా సాంగ్స్ డైరెక్టర్ గా వ్యవహరించినప్పటికీ మరో సినిమాకి డైరెక్షన్ మాత్రం చేయలేదు. ఈ క్రమంలో సుష్మిత ప్రొడక్షన్ లో వెబ్ సిరీస్ కి డైరెక్షన్ చేయబోతున్నారట.ఇక ఈ కార్యక్రమంలో చిరు సతీమణి సురేఖతో పాటు, సుస్మిత, ఆమె భర్త విష్ణు, చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెద్ద కూతురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here