మా ఎన్నికలు చాలా దౌర్జన్యంగా జరిగాయి: నటుడు చరణ్ తేజ ఎమోషనల్ లెటర్

మా ఎన్నికలు జరిగిన తీరుపై మా అసోసియేషన్ సభ్యులు కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు తాజాగా ఇదే విషయంపై నటుడు చరణ్ తేజ తన ఆవేదన వ్యక్తం చేశారు అన్యాయంగా జరిగిన ఎన్నికలను రద్దు చేసి రీ ఎలక్షన్స్ పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఆయన ఏమన్నారో చరణ్ తేజ మాటల్లోనే..

” నా పేరు చరణ్ తేజ.. నేను మా మెంబర్.. ఆ రోజు మా ఎలక్షన్స్ జరిగిన తీరు చాలా అన్యాయంగా ఉంది.. దౌర్జన్యంగా ఉంది.. పోలింగ్ రోజు కుర్చీలు వేసుకుని దౌర్జన్యంగా మాకు ఓటేయండి అంటూ అన్ పార్లమెంటరీ భాష మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించారు. మోహన్ బాబు గారు అక్కడే ఉండి ఇవన్నీ చూశారు. ఈ విషయం ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ గారికి కూడా తెలుసు. ఎన్నికలు జరిగిన తీరు చాలా అసంతృప్తికరంగా ఉంది. మా ఎన్నికలు పూర్తయిన తర్వాత 11 మంది సభ్యులు రాజీనామా చేసిన తర్వాత కూడా.. విష్ణు గారు అవేవి పట్టించుకోకుండా.. వాళ్లని ఏమీ అడగకుండా.. సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా ప్రమాణస్వీకారం చేశారు. అది మా అసోసియేషన్..
అంటే మన అందరి అసోసియేషన్.. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను కృష్ణ మోహన్ గారికి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన కంప్లైంట్ తీసుకుంటానని చెప్పారు. కానీ ఆ తర్వాత రోజు ఫోన్ చేస్తే విష్ణు గారు చార్జ్ తీసుకున్నారు.. నేనేం చేయలేను అని అన్నారు. నేను ఫోన్ చేసిన రెండు గంటల తర్వాత విష్ణు గారు చార్జ్ తీసుకున్నారు. ఇది నిజం కాదా అని కృష్ణ మోహన్ గారిని నేను అడుగుతున్నాను. మీలాంటి పెద్ద వాళ్లే ఇలా చేస్తే.. మాలాంటి కొత్త నటులు, హీరోలు ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలి.. ఎవరికి చెప్పుకోవాలి.. ఒకసారి మీరే ఆలోచించుకోవాలి..

నేను ప్రకాష్ రాజ్ గారిని కూడా అడుగుతున్నాను.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు రాజీనామా చేసి బయటకు వెళ్లి.. అక్కడి నుంచి ప్రశ్నిస్తామని చెప్పారు. నేను మిమ్మల్ని కూడా డిమాండ్ చేస్తున్నాను.. మా సభ్యుడిగా నా తరఫున మీరు అసోసియేషన్ ప్రెసిడెంటును ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. జరిగిన అన్యాయంపై మీరు కూడా స్పందించాలి. ఈ విషయం తేలేవరకు నేను వదిలిపెట్టను. క్రమశిక్షణ అంటే ఏ గొడవ జరగకుండా చూసుకోవడం.. అందరినీ ఎదురు మాట్లాడనీయకుండా చేయడం కాదు. క్రమశిక్షణ అనే దానికి అసలు అర్థం కూడా తెలియదు మోహన్ బాబు గారికి. ప్రకాష్ రాజ్ గారు నా తరఫున ప్రశ్నించాలి అని కోరుకుంటున్నాను..

ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారిని అడుగుతున్నాను.. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న మీరు జరిగిన ఎన్నికలు పూర్తిగా అసంబద్ద పద్ధతిలో జరిగాయని తెలుసుకొని.. దాని మీద ఒక కమిటీ వేసి అక్కడ సి సి ఫుటేజ్ పరిశీలించి.. రీ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాను.. ఇది జరిగే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను” అని తెలిపారు చరణ్ తేజ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here