తమన్నా సత్యదేవ్‌ల‌ కాంబినేషన్లో లవ్‌ మాక్‌టైల్

మన చిత్ర పరిశ్రమలో ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి రావడం పెద్ద కొత్తేమీ కాదు. అయితే టాలీవూడ్ ఇండస్ట్రీలో ఎక్కువుగా తమిళ, హిందీ, మలయాళం చిత్ర పరిశ్రమ నుండి ఎక్కువ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు మన దర్శకులు. అయితే యూ టర్న్‌ సినిమా తర్వాత మనవాళ్ల చూపు కన్నడ సీమవైపు వెళ్తోంది. తాజాగా మరో కన్నడ సినిమా టాలీవుడ్‌కి వస్తోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్. ఇక టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు.

కన్నడ ‘లవ్‌ మాక్‌టైల్‌’ను కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించారు. ఇందులో మిలనా నాగరాజ్‌, అమృత అయ్యంగర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రూ. 5 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఇందులో నటనకుగాను ప్రధాన పాత్రధారులకు మంచి పేరు వచ్చింది.

మరి తెలుగులో తమన్నా – సత్యదేవ్‌ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు. మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా పని చోయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here