ప్రజా సంకల్ప పాదయాత్ర తో 3500 కిలోమీటర్లు నడిచి దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకులు నడవని విధంగా ప్రజల భాధలను తెలుసుకొని విధంగా ప్రతి సమస్యలను తెలుసుకొని ఓపికగా వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఈనెల 9వ తారీఖున ముగుస్తున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వైసిపి పార్టీ క్యాడర్. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన నాయకులు మరియు కార్యకర్తలు ముగింపు సభ అదిరి పోవాలని ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ నెలలో మొదలైన యాత్ర నిరవధికంగా సాగి దాదాపు 3500 కిలోమీటర్లకుపైగా 134 నియోజకవర్గాల్లో 120 బహిరంగసభలో రెండు వేలకు పైగా గ్రామాలను సందర్శించి అక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకున్నారు వైయస్ జగన్. ఈ క్రమంలో ఈనెల 9వ తారీఖున ఇచ్చాపురంలో జరగనున్న భారీ బహిరంగ సభ గురించి వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఈ సందర్భంగా తెలిపారు. పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 2 నుంచి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్ర లక్ష్యాలను నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు వివరిస్తారన్నారు.గడిచిన పదేళ్లల్లో ఊహించని సమస్యలు, అక్రమ కేసులు, జైలు జీవితం, హత్యాయత్నం వరకు ఎన్నో కష్టాలను జగన్ చవిచూశారు. 2019 కొత్త సంవత్సరం జగన్ నామ సంవత్సరం అని తెలిపారు. ఇదే క్రమంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు జగన్ భవిష్యత్తు సంవత్సరం స్టార్ట్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు.





