‘కథ కంచికి మనం ఇంటికి’ మొద‌టిలుక్ కి అనూహ్య స్పంద‌న‌

KKMI First Look: Intriguing And Experimental

వ‌రుసగా మంచి చిత్రాలు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో  అదిత్ అరుణ్ హీరోగా, పూజిత పొన్నాడ జంటగా MP ఆర్ట్స్ బ్యానర్‌పై చాణక్య చిన్న  ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం క‌థ కంచికి మ‌నం ఇంటికి. ఈ చిత్రం టైటిల్ ని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండి సినిమా ల‌వ‌ర్స్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్గ్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. పక్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా  తెరకెక్కిస్తున్న  ఈ సినిమాను మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు.  ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమాకు శ్రీనివాస్ తేజ మాటలు రాస్తున్నారు. భీమ్స్ సిసిరాలియో సంగీతం అందించిన ఆడియొ అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతం గా ఆక‌ట్ట‌కునేలా ట్యూన్స్ ఇచ్చారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. హీరో అదిత్ అరుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ చిత్రం యోక్క మొద‌టి లుక్ ని యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి మాట్లాడుతూ.. క‌థ కంచికి మ‌నం ఇంటికి అనే ఒక అద్బుత‌మైన టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. పూర్తి వైవిధ్యం గా ఈ క‌థ ని ద‌ర్శ‌కుడు చాణిక్య చిన్న మాకు చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ప్పుడే టైటిల్ ని అనుకున్నాం. మాకు చెప్పిన దానికంటే కూడా చాలా బాగా తెర‌కెక్కించాడు. అస‌లు ఈ క‌థ కి హీరో ఎవ‌రా అనుకున్న‌ప్పుడు మా అంద‌రి నోట ఒకే మాట అదిత్ అరుణ్ అని.. ఆయ‌న ఫెర్‌ఫార్మెన్స్ మాత్రం ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్ర‌తి సినిమాకి ఒదిగివుండి క‌థ లో పాత్రలో ఒదిగిపోతాడు . ఈ సినిమాతో మా ఫ్యామిలి మెంబ‌ర్ అయ్యిపోయాడు. క్లైమాక్స్ లో అదిత్ న‌ట‌న కి ప్రేక్ష‌కులు ధియోట‌ర్ లో ఊగిపోతారు ఇది నిజం.. మా హీరో అదిత్ అరుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా మా చిత్రం మొద‌టి లుక్ ని మొష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసాము. చాలా మంచి రెస్పాన్స్ రావ‌డం మా యూనిటిక్ ఆక్సిజ‌న్ ఇచ్చింది. అలాగే మా హీరోకి బ‌ర్త్‌డే గిప్ట్ ఇది. హ్య‌పి బ‌ర్త్‌డే టు అదిత్ అరుణ్‌. అని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here