ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఏపీ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నిన్న అంతర్వేది ఆలయంలోని రథం దగ్దమైన విషయం తెలిసిందే. దీంతో పురాతనమైన ఎంతో చరిత్ర కలిగిన రథం కాలిపోయిందని భక్తులంతా ఆవేధన చెందుతున్నారు.
టిడిపి నేతలు మాట్లాడుతూ ఏపీలో జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులు ఎక్కువైనట్లు చెప్పారు. దీంతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇక ముందు ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఈ దాడులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, సీబీఐ ఎంక్వైరీ కానీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతర్వేది ఆలయంలోని రథం దగ్దమైన ఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించి విచారణకు ఆదేశించారు. రథం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే.






