కొత్త వాళ్లతో హిట్ కొడతా: స్టార్ డైరెక్టర్ పూరీ షాకింగ్ కామెంట్స్

నేను రాసిన కథ ఏ హీరోకి నచ్చితే ఆ హీరోతో టేక్ అనడానికి రెడీగా ఉన్నా.. స్టార్ హీరోలతోనే చేయాలనేం లేదు.. మహా అయితే డబ్బులు తక్కువ వస్తాయ్.. అంతే కాని సినిమా ఆడకుండా పోదుగా..

ఇంతకు ముందు ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉండేదంటే.. ఒక దర్శకుడు లేదా నిర్మాతతో సినిమా ఫ్లాప్ అయితే వెంటనే వాళ్లకు మరో అవకాశం ఇచ్చే వారు హీరోలు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఈ సాంప్రదాయం బాగానే ఉండగా.. తరువాత జనరేషన్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యలు కూడా కొనసాగించారు. కాని నేటి జనరేషన్‌లో రవితేజతో కలిపి ఒకరిద్దరు తప్పితే మిగిలిన స్టార్ హీరోలు ఫ్లాప్ దర్శకుల్ని పట్టించుకోవడమే మానేశారు. హిట్ ఉన్నోడే హీరో.. ఫ్లాప్ పడిందో ఆ దర్శకుడు జీరోనే అన్నట్టుగా హిట్ మంత్రం జపిస్తున్నారు.

మరీ విచిత్రం ఏంటంటే.. ఏ దర్శకుడి వల్లనైతే తమకు స్టార్ డమ్ వచ్చిందో కూడా మరిచిపోయే.. ఫ్లాప్ పడేసరికి పక్కకి ఉండమని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. కంటెంట్ ఉన్న కథతో మళ్లీ వచ్చినా.. హిట్ ఉందా లేదా లేదా అన్నదే మెయిన్ కాన్సెప్ట్ అయ్యింది. అయితే ఇదే ఇష్యూపై డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డేరింగ్ కామెంట్స్ చేశారు.

ఈ పరిస్థితి చూస్తే.. టాలీవుడ్ డేంజర్ జోన్‌లో పడుతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. నేనైతే నేను రాసుకున్న కథకు వాళ్లు వీళ్లు అని కాదు.. ముందు సినిమా తీయాలని ఉంటుంది. ఒక కథ ఒక హీరోకి అయితే బాగుంటుందని అనుకుంటాం. కాని అన్ని సందర్భాల్లో అది కుదరదు. అలాంటి సందర్భంలో నా కథ ఎవరికి నచ్చితే వాళ్లతో టేక్ అనేందుకు రెడీగా ఉంటా. మహా అయితే మార్కెట్ డౌన్ అవుతుంది. స్టార్ హీరోతో చేసిన దానికి కొత్త హీరోతో చేసిన దానికి డబ్బుల్లో తేడాలు రావొచ్చేమో కాని.. ఔట్ పుట్.. ఆడియన్స్ రిసీవింగ్ మాత్రం మారదు.

కాని ఇలా సినిమా చేయడం వల్ల మనకో క్యారెక్టర్ ఉంటుంది. నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా.. నువ్ లేకపోతే నాకు దిక్కులేదు అనే మాట నా లైఫ్ లేదు రాదు.. అనను. కొత్తవాళ్లతోనే సినిమా తీసి హిట్ కొడతా.. సినిమా ఉంటే నేను ఖాళీగా ఉండను. ఉదయం 5 గంటలకు అలారం పెడితే 4కి లేచి 5 ఎప్పుడౌతుందా అని చూస్తా. పని ఉంటే నాకు నిద్రే పట్టదు. నన్ను ఎవడు బాగుచేస్తాడు. పనిచేస్తేనే యాక్టివ్‌గా ఉంటా.. జబ్బులు, జ్వరాలు రావు. నా సినిమాల్లో ఫిలాసఫీ ఉంటుంది.. నాకు అవి ఉండటం ఇష్టం.

అమ్మనాన్న తమిళ అమ్మాయి సినిమా నేను ఎన్ని సినిమాలు చేసినా అది టాప్‌లో ఉంటుంది. మళ్లీ అలాంటి కథ ఒకటి రాశా.. ఇమిడియేట్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఆ కథ. ఇన్నాళ్లు నేను ఏదైనా మిస్ చేశానో.. మళ్లీ అది తప్పకుండా ఈ కథలో మీరు చూస్తారు’ అంటూ తన కొత్త విశేషాలను చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here