మెదక్‌లో ఘోరం.. రూ.5 వేలకు అమ్మకానికి ఆడపిల్ల!
Medak: పసికందును కన్న తల్లిదండ్రులకు ఆర్థికపర సమస్యలు ఉన్నాయని, అందుకే శిశువును అమ్మారని అంటున్నారు. మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలం చిటుకుల్ తండాలో ఈ ఘటన జరిగింది.
విశాఖ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
PM Modi: విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.
కానిస్టేబుల్ వేలు కొరికేసి బీభత్సం.. విజయవాడలో దారుణం
అపార్ట్‌మెంట్‌కి వెళ్లి పనిమనిషి వివరాలు ఆరా తీస్తున్న కానిస్టేబుల్‌పై సయ్యడ్ దాడి చేశాడు. విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ చేతివేలిని కొరికేసి బీభత్సం సృష్టించాడు.
‘నాతో అఫైర్ పెట్టుకోకపోతే నీ మొగుడిని చంపేస్తా’.. మహిళకు బెదిరింపులు
తనతో అక్రమ సంబంధం పెట్టుకోకపోతే భర్తను చంపేస్తానని ఓ వ్యక్తి వేధిస్తున్నట్లు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
కరోనా కష్టకాలంలో అవసరమైన వారికి భారత్ అండగా ఉంది.. ప్రధాని మోదీ
బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ, ఐబీసీ ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ వర్చ్యువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.
కనురెప్ప మూశాడు.. కనుమరుగైపోయాడు.. ప్రకాశంలో విషాదం
ఇంటికి వెళ్దామని బైక్‌పై అర్ధరాత్రి ప్రయాణమయ్యారు. మరికొద్దిసేపట్లో ఇంటికి వెళతామనగా బైక్ ప్రమాదానికి గురైంది. బైక్ నడుపుతూనే నిద్రపోయిన మాలకొండయ్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
మొదటి భర్తను మరిచిపోలేక.. రెండో భర్తతో ఉండలేక మహిళ ఆత్మహత్య
విడాకులు తీసుకున్నా మొదటి భర్త జ్ఞాపకాలను మరిచిపోలేని మహిళ రెండో భర్తతో కాపురం చేయలేక సతమతమైంది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది.
చైనాకు ఝలక్ ఇవ్వబోతున్న భారత్ .. 1000కిపైగా అమెరికా సంస్థలతో చర్చలు!
చైనాలో కార్యకలాపాలు సాగిస్తోన్న అమెరికా ఉత్పత్తి సంస్థలను ఆకర్షించే ప్రయత్నాలను భారత్ ప్రారంభించింది. వెయ్యికిపైగా సంస్థలతో భారత అధికారులు చర్చలు జరుపుతున్నారని సమాచారం.
ఊబిలో చిక్కుకుని ఇద్దరు యువకులు మృతి.. విషాద ఘటన
ఆరుగురు యువకులు ఈత కొట్టేందుకు కృష్ణానదికి వెళ్లారు. ఇద్దరు హఠాత్తుగా నీటమునిగిపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటికి వెలికితీశారు.
కరోనాపై పరిశోధన చేస్తున్న చైనా సంతతి శాస్త్రవేత్త హత్య
కరోనా వైరస్ గురించి పరిశోధనలు చేస్తున్న ఓ శాస్త్రవేత్తను ఆయన ఇంటిలోనే హత్యచేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పరిశోధన కీలక దశకు చేరుున్న తరుణంలో చైనా సంతతికి చెందిన ఆమెరికన్ హత్యు గురయ్యారు.


