బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ’ బంగ్లాలు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటన !

బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో ‘బచ్చన్ కుటుంబానికి సంబంధించిన నాలుగు బంగ్లాలను ‘బీఎంసీ’ సీలు చేసి వాటిని కంటైనర్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆ వైపు ఎవ్వరూ వెళ్లకుండా పోలీస్ లు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇక అమితాబ్ బచ్చన్’ లాంటి దిగ్గజానికి కరోనా పాజిటివ్‌ రావడం దేశ ప్రజలతో పాటు భారతీయ చలనచిత్ర ప్రముఖులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే అమితాబ్ అభిమానులు కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ కుంటుంబానికి నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా కరోనా ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు.

అయితే తాజాగా అమితాబ్ తేలికపాటి కోవిడ్ లక్షణాలతో స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన్ను ఆసుపత్రిలోని ఐసోలేషన్ విభాగంలో ఉంచారు. అమితాబ్‌తో పాటు ఆసుపత్రిలో చేరిన అభిషేక్ బచ్చన్ కూడా స్థిరంగా మరియు బాగా కోలుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here