హ్యాట్రిక్ విజయం సాధించే క్రమంలో బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వారం రోజులపాటు షూటింగ్ జరుపుకుని కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయి అంజలిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో బాలయ్యతో ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలినే ఇప్పుడు మరోసారి బాలయ్య సరసన హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే టైటిల్ ప్రకటించనున్నారు. బాలయ్య–బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.