అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ క‌థ‌కు విశేషాద‌ర‌ణ‌

యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా ప‌తాకం పై ఓటిటి దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వీడియో స‌మ‌ర్ప‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించ‌గా పేప‌ర్ బాయ్ మూవీ ఫేమ్ సంతోశ్ శోభ‌న్, కావ్య‌తాపర్ జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కార్తీక్ రాపోలు తెర‌కెక్కించిన సినిమా ఏక్ మినీ క‌థ‌. ఓ సెన్సిటివ్ టాపిక్ ని తీసుకొని ఆ పాయింట్ ఆదంత్యం వినోద‌భ‌రితంగా మ‌ల‌చి, అందులోనే ఎమోష‌న్స్, ల‌వ్, రొమాన్స్ త‌దిత‌ర అంశాల్ని జోడించి ఏక్ మినీ క‌థ‌ని ఫుల్ ఫ్యామీలి ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు కార్తీక్ రాపోలు. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచి అంద‌రిలో ఆస‌క్తి పెంచుతూ వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ లు అంద‌ర్ని విశేషంగా ఆక‌ట్టుకోవడ‌మే కాకుండా సోష‌ల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచాయి. మే 27న డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌లైన ఈ సినిమా ప్ర‌స్తుతం విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ అందకుంటూ ముందుకు సాగుతోంది. ఈ ఏడాది డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు విడుద‌ల చేసిన తెలుగు సినిమాల్లో ఏక్ మినీ క‌థ‌కు అత్య‌ధిక ఓపెనింగ్ వ్యూయెర్ షిప్ ల‌భించ‌డం విశేషం. మేర్ల‌పాక గాంధీ రాసిన క‌థ‌, కార్తీక్ రాపోలు డైరెక్ష‌న్ స్కిల్స్, సంతోశ్ శోభ‌న్ ప‌లికించిన హావ‌భావ‌లు, పెర్ ఫార్మెన్స్, కావ్య‌తాప‌ర్ బ్యూటీ, క‌మీడియ‌న్లు సుద‌ర్శ‌న్, స‌ప్త‌గిరి ప‌లికించిన పంచ్ డైలాగ్స్, యూవీకాన్సెప్ట్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ వెర‌సి ఏక్ మినీ క‌థ‌ను ఏక్ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌థ‌గా మార్చేసాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here