రియాల్టీ షో ‘బిగ్ బాస్’ 4 హోస్టుగా విజయ్ దేవరకొండ..!

మాయదారి కరోనా పుణ్యమా అని ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చినా కూడా.. స్టార్లు ఎవ్వరూ కూడా పాల్గొనేందుకు ఆసక్తి చూపించట్లేదు. ఇక బుల్లితెర విషయానికి వస్తే గత కొద్దిరోజులుగా కొంతమంది ఆర్టిస్టులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్‌లకు హాజరు కావాలా.. లేక మరికొంత సమయం తీసుకోవాలో తెలియక టీవీ నటులు గందరగోళంలో ఉన్నారు.

ఇలాంటి తరుణంలో బుల్లితెర సెన్సేషనల్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ గురించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటిదాకా ‘తెలుగు బిగ్ బాస్ సీజన్ 4’కు హోస్టుగా తారక్, సమంతా, నాగార్జున పేర్లు వినిపించగా.. తాజాగా రౌడీ విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. అటు త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, బిత్తిరి స‌త్తి తదితరులు కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారని టాక్ నడుస్తోంది. అయితే హోస్టు విషయంలో గానీ, కంటెస్టెంట్ల విషయంలో గానీ షో నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఈ షో నాలుగో సీజన్ షూటింగ్ డిసెంబర్‌లో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here