దువ్వాడ జగన్నాథం లో పవన్ ఫాన్స్ కి బన్నీ పంచ్ వెయ్య బోతున్నడా ?

ఎప్పుడైతే చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి స్టేజీ మీద పవన్ ఫాన్స్ సాక్షిగా అనేసాడో అప్పుడే హీరో అల్లూ అర్జున్ కి పొగరు అంటూ పవన్ ఫాన్స్ అతనిమీద కక్ష గట్టారు. అందరూ కాదు కానీ చాలామంది పవన్ ఫాన్స్ కి ఇప్పుడు బన్నీ అంటే విపరీతమైన కోపం. తాజాగా దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ చక చకా జరిగిపోతూ ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.

పవన్ ఫాన్స్ కి దూరమైన తాను ఎలాగైనా మళ్ళీ వారికి దగ్గర అవ్వాలి అనే ఉద్దేశ్యం తో పవన్ ప్రస్తావన వచ్చేలా ఒక సీన్ రాయించుకున్నాడు అంటున్నారు. హరీష్ శంకర్ స్వతహాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడం తో ఈ సీన్ ని ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేలా రాసాడట కూడా. పవన్ ఫాన్స్ కి తాను ఎప్పటికీ దగ్గరే అనే ఫీలింగ్ వచ్చేలా ఈ డైలాగ్స్ ఉంటాయి అనీ దీనికోసం ఒక ఐదు నిమిషాల్ సీన్ నే ప్లాన్ చేసారు అనీ ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఇదంతా నిజమో కాదో సినిమా వచ్చేదాకా చూడాల్సిందే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here