కోసి కారం పెట్టిన హీరో భార్య..

ఈ లాక్ డౌన్ పుణ్యమా అని సినీ హీరోలు  హీరోయిన్లంతా గరిటె పట్టుకొని వంటగదిలో వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మెల్లగా ఒక్కొక్కరుగా ఈ మధ్య మన తెలుగు పచ్చళ్లలో అమృతమైన ఆవకాయ పచ్చడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇదివరకే మెగా ఫ్యామిలీ నుండి నిహారిక ఉపాసనలు ఆవకాయ పచ్చడి పెట్టి.. ఆ ఆవకాయ జాడి ఫోటోలు నెట్టింట్లో పెట్టి.. అందరికి నోట్లో నీళ్లూరేలా చేశారు.

 

ఇక ఇపుడు తాజాగా మరో హీరోయిన్ బిగ్ బాస్ 3వ సీసన్ కంటెస్టెంట్ వితిక సందేశ్ షేరు.. ఆవకాయ పచ్చడి పెట్టి అందరిని ఆశ్చర్య పరిచింది. వితిక సందేశ్ కొన్నేళ్ల క్రితమే హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లాడింది. బిగ్ బాస్ లో దంపతులిద్దరు పాల్గొని అలరించారు. ఇక లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న వితిక సందేశ్.. లేత లేత మామిడి కాయలను కోసి కారం పెట్టి పచ్చడి తయారు చేసింది.

 

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వితిక సందేశ్… బిగ్ బాస్ కి ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక బిగ్ బాస్ లో కూడా వరుణ్ సందేశ్ భార్య అని తెలియడంతో అందరూ కాస్త దృష్టి పెట్టి గుర్తుంచుకున్నారు. ఇక అప్పటినుండి వితిక తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో దగ్గరవుతూ వస్తుంది. తాజాగా ఆవకాయ పచ్చడి తయారు చేసిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. స్మైలింగ్ ఫేస్ తో ఆవకాయ కలుపుతున్న ఫోటోలు చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. ప్రస్తుతం వితిక ఆవకాయ పచ్చడి సోషల్ మీడియా మార్కెట్లో ఫేమస్ అయిపోయింది. ఇక 2015లో విడుదలైన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో వరుణ్ సరసన నటించి.. నిజంగానే వరుణ్ తో ప్రేమలో పడి పోయింది. ఆ తర్వాత 2016లో ఇద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here