కళ్యాణ్ కొడుకు .. ఒక పెద్ద దొంగ. అడ్డంగా దొరికాడు

ఏదో ఒక వివాదం తో వార్తల్లో నిలిచే వ్యక్తి సి కళ్యాన్. ఈ మధ్య కాలం లో వివాదాలకి దూరంగా ఉంటున్న కళ్యాణ్ కి ఇప్పుడు తన కొడుకు చేసిన పనుల వలన కొత్త ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అంతటి స్థాయి కలిగిన వ్యక్తి కుమారుడు ఇలా చేసాడు ఏంటి అనుకుంటున్నారు అందరూ. సి కళ్యాణ్ కొడుకు పేరు చిల్లర వరుణ్ కుమార్. అతని మీద ఇప్పుడు పోలీసు కేసు నమోదు అయ్యింది.

ఈ కేసు కూడా ఏదో ట్రాఫిక్ గొడవ కాదు దొంగతనం కేసు. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీ కి చెందిన ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి తన కొడుకు తో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కి వచ్చాడు. స్విమ్మింగ్ కోసం అక్కడ దగ్గరలో పర్సు పెట్టి స్నానం చేస్తూ ఉండగా అదే టైం లో పార్స్ మిస్ అయ్యింది.

అందులో చాలా డెబిట్ కార్డ్ లూ , క్రెడిట్ కార్డ్ లూ ఉన్నాయి. పార్స్ పోయిన కాసేపటికే డబ్బులు వేరే అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ అయిపోయాయి. దీంతో పోలీసు కేసు పెట్టి యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఎంక్వైరీ చేస్తే దాదాపు లక్షన్నర పైగా సొమ్ము చిల్లర వరుణ్ ఎకౌంటు లోకి వెళ్ళిపోయాయి, సీసీ కెమెరా ల ద్వారా పర్సు కూడా అతనే కొట్టేసాడు అని తేలిపోయింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here