ఉప్పెనలా దూసుకెళ్తున్న వ్యూస్..

మెగాఫ్యామిలీ నుండి వస్తున్నా మరొక హీరో వైష్ణవతేజ్ నటిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా లోని పాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులోని ‘నీ కళ్ళు నీలి సముద్రం’ పాట రేసెంటుగా 50 మిలియన్ వ్యూస్ యూటూబ్లో కంప్లీట్ చేసుకుంది. మెగా కాంపౌండ్ నుండి రాబోతున్న మరో హీరో కనుక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రాక్స్టార్  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించటంతో బాగా పాపులారిటీ వచ్చింది. కాగా క్రితిశెట్టి ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగుతెరకు పరిచయం కానుంది.

నిజానికి ఏప్రిల్ 2 న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. కానీ లొక్డౌన్ కారణంగా పోస్టుపోన్ అయింది. త్వరలోనే రిలీజ్కి సిద్ధంగా వున్నా ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ బద్దలుకొడుతుందొ వేచి చూడాల్సిందే…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here