ఆ క‌థ చైతూకి బాగా నచ్చిందట..?

నాగ‌చైత‌న్య – స‌మంత‌ ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ జోడీ క‌ట్ట‌బోతున్న‌ట్టు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. తెర‌పైనే కాదు, నిజ జీవితంలోనూ సూప‌ర్ హిట్ జోడీ అనిపించుకున్నారు నాగ‌చైత‌న్య – స‌మంత‌. పెళ్ల‌య్యాక ఇద్ద‌రూ క‌లిసి చేసిన తొలి సినిమా `మ‌జిలీ` మంచి విజ‌యాన్ని అంకుంది. అటు చైలోనూ, ఇటు స‌మంత‌లోనూ మెచ్యూరిటీ లెవ‌ల్స్ క‌నిపించాయి.

 

నాగ‌చైత‌న్య కోసం విక్ర‌మ్ కె.కుమార్ ఓ స్క్రిప్టు రెడీ చేశాడు. అదే.. `థ్యాంక్యూ`. ఈ క‌థ చైతూకి బాగా న‌చ్చింది. వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ప్ర‌స్తుతం స్క్రిప్టు ని ఫైన్ ట్యూన్ చేస్తున్నాడు విక్ర‌మ్. క‌థానాయిక‌గా స‌మంత పేరు ప‌రిశీలిస్తున్నాడ‌ట‌. స‌మంత దాదాపుగా ఖాయం అన్న‌మాట‌లు వినిపిస్తున్నాయి. విక్ర‌మ్ కూడా.. `నాకు స‌మంతే కావాలి` అని ప‌ట్టుబ‌డుతున్నాట‌. విక్ర‌మ్ తీసిన `మ‌నం`లోనూ స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. `24`లోనూ త‌నే నాయిక‌. ఆ సెంటిమెంట్ తోనే విక్ర‌మ్‌. సమంత వైపు మొగ్గు చూపిస్తున్నాడ‌ట‌.

 

పెళ్ల‌య్యాక చైతో క‌లిసి న‌టించ‌డానికి స‌మంత బాగా ఆలోచిస్తోంది. ఆషామాషీ క‌థ‌ల్ని అస్స‌లు ఒప్పుకోవ‌డం లేదు. `మ‌జిలీ`లో న‌టించ‌డానికి కూడా త‌ట‌ప‌టాయించింది. అయితే ఈసారి విక్ర‌మ్ కుమార్ కి `ఎస్‌` చెప్పేసింద‌ని స‌మాచారం.సో.. ఈ హిట్ కాంబో మ‌రోసారి అల‌రించ‌డానికి రెడీ అవుతోంద‌న్న‌మాట‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here