ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడ్డా ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ యాక్టర్ అథర్వ మురళి నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మురళి ప్రభాస్ సోదరుడిగా నటించనున్నాడని సమాచారం. ఈ విషయమే ఇప్పటికే చిత్ర యూనిట్ మురళిని సంప్రదించగా… వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
పాత్ర చిన్నదే అయినప్పటికీ ప్రభాస్ వంటి పెద్ద స్టార్ తో నటించే అవకాశం రాగానే మురళి ఓకే చేశాడని చెబుతున్నారు. మురళి ఇదివరకు వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.
ఇక పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ లాక్‌డౌన్‌కి ముందు యూరప్‌లో చిత్రీకరణ జరుపుకుంది. త్వరలోనే హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ పునఃప్రారంభం కానుంది.






