అయ్య‌ప్యస్వామి ద‌ర్శ‌నంలో షాకింగ్ రూల్స్‌..

క‌రోనా ఎఫెక్టు ఆల‌యాల‌పై తీవ్రంగా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్ర‌ముఖ ఆల‌యాలు తెరుచుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్య స్వామి ఆల‌యం కూడా ఓపెన్ చేశారు. అయితే ఇక్క‌డి రూల్స్ మాత్రం భ‌క్తుల‌ను షాక్‌కు గురిచేస్తున్నాయి.

క‌రోనా కార‌ణంగా ఏడు నెల‌ల త‌ర్వాత మొద‌టిసారి శ‌బ‌రిమ‌ల ఆల‌యం తెరుచుకుంది. అయితే ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తి ఇస్తామ‌ని అధికారులు చెప్పారు. వారం ఆరంభంలో వెయ్యి మందికి, వీక్ ఎండ్‌లో 2 వేల మంది ద‌ర్శ‌నం చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. తీరా ఆల‌యం ఓపెన్ చేశాక భ‌క్తులు మాత్రం కేవ‌లం 246 మంది మాత్ర‌మే త‌మ పేర్ల‌ను వ‌ర్చువ‌ల్ క్యూలో న‌మోదు చేసుకున్నారు. దీంతో అధికారులు ఈ సంఖ్య‌ను మ‌రింత త‌గ్గించి కేవ‌లం 250 మందికి మాత్ర‌మే ఇప్ప‌టి నుంచి ద‌ర్శ‌నానికి అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అంతేకాకుండా శ‌బ‌రిమ‌ల వెళ్లాల‌నుకునే వారికి ప్ర‌త్యేకంగా రూల్స్ పెట్టారు. కాగా అన్ని ప్రాంతాల్లో ఉన్న‌ట్లు మాస్కులు ధ‌రించాల‌ని చెబుతూనే ద‌ర్శ‌నానికి వ‌చ్చే వారు 48 గంట‌ల ముందు క‌రోనా టెస్టు చేయించుకోవాల‌ని నిబంధ‌న పెట్టారు. ఇలా ప‌రీక్ష చేయించుకొని వచ్చిన వారికి మాత్ర‌మే ద‌ర్శనానికి అనుమ‌తులు ఇస్తామ‌ని చెబుతున్నారు. ప‌ది సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌లు, 60 సంవత్స‌రాలు దాటిన వారు కూడా ద‌ర్శ‌నానికి రావ‌డానికి వీలు లేదు. కేర‌ళ‌లో ప్ర‌స్తుతం రెండో సారి క‌రోనా విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో అధికారులు నిబంధ‌న‌ల విషయంలో వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here