టాలీవుడ్‌ యాంకర్స్ సంచలన నిర్ణయం..?

బాలీవుడ్‌లో బచ్చన్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ అనగానే సెలబ్రిటీలందరూ వణికిపోతున్నారు. మొదటి నుంచి కరోనా విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెప్పడమే కాకుండా, తను కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటున్న అమితాబ్‌నే కరోనా వదలలేదంటే.. మనమెంత అనే భావన ఇప్పుడు సెలబ్రిటీలందరిలో నెలకొంది.

అందులో ముఖ్యంగా అమితాబ్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి షో కోసం చేసిన ఆడిషన్స్‌లో పాల్గొనడం వల్లే అతనికి కరోనా వచ్చిందనే వార్తలు ఇప్పుడు టీవీ ఇండస్ట్రీని సైతం భయపెడుతున్నాయి. అందుకే ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆపేసి.. కొంతకాలం కామ్‌గా ఉండటమే బెటర్ అనే నిర్ణయానికి అందరూ వచ్చినట్లుగా టాక్ నడుస్తుంది.

ఇప్పుడు బాలీవుడ్ ఎఫెక్ట్ టాలీవుడ్‌పై కూడా పడింది. టాలీవుడ్‌లో యాంకర్స్ కూడా షూటింగ్స్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారనే వార్త సోమవారం మీడియా సర్కిల్స్‌లో హైలెట్ అవుతుంది.ముఖ్యంగా టాలీవుడ్ టాప్ యాంకర్స్‌గా పేరున్న సుమ, అనసూయలు ఇకపై ఏ షూటింగ్‌లో పాల్గొనకూడదనే నిర్ణయానికి వచ్చారట. టీవీ పరిశ్రమని కూడా కరోనా భారీగా తాకుతున్న నేపథ్యంలో.. ఇకపై వీరిద్దరూ షూటింగులకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాంకర్లుగా వీరిద్దరూ ఎన్నో షోలు చేస్తుంటారు. వాటి నిమిత్తం షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ పరిస్థితులు దారుణంగా మారుతుండటంతో.. షూటింగ్స్ చేయకపోవడమే బెటర్ అని వారు భావిస్తున్నారట.ముందు ముందు కొన్ని టీవీ షోలు కూడా భయం కారణంగా నిలిచి పోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here