బతుకమ్మ పాటకు కాలు కదిపిన రామ్‌ చరణ్‌..

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించేవారిలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఒకరు. కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు భార్యతో కలిసి విహార యాత్రలకు వెళ్తుంటాడీ మెగా హీరో. ఇదిలా ఉంటే భార్య ఉపాసనతో కలిసి రామ్‌ చరణ్‌ బతుకమ్మ పాటకు  స్టెప్పులు వేసిన పాత వీడియో ఒకటి ఇప్పుడు నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియో తాజాగా జరిగిన బతుకమ్మ వేడుకలది కాకపోయినప్పటికీ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఉపాసన అమ్మవారి ఇంట్లో 2017లో జరిగిన బతుకమ్మ వేడుకలకు హాజరైన చెర్రీ ఇలా బతుకమ్మ పాటకు కాలు కదిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అపోలో కుటుంబానికి చెందిన ఉపాసన కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారనే విషయం తెలిసిందే. ఇక రామ్‌ చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే ఓ తమిళ దర్శకుడితో పాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించడానికి చెర్రీ ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here