జ‌గ‌న్ మెచ్చిన కొత్త మంత్రులు వీరే….

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కొత్త రంగులు మెరువ‌నున్నాయి. ఇద్ద‌రు కొత్త మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న కెబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు.

వివ‌రాల్లోకి వెళితే రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న ఇద్ద‌రు మంత్రులు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవిలను రాజ్య‌స‌భ‌కు పంపిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వీళ్లు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేశారు. రేపు రాజ్య‌స‌భ‌లో వీళ్లు ఎంపీలుగా ప్ర‌మాణ స్వీకారం కూడా చేయ‌నున్నారు.  దీంతో వీరి స్థానాల్లో కొత్త వారిని మంత్రులుగా ఎంపిక చేయ‌నున్నారు. రాష్ట్ర మంత్రివ‌ర్గంలో మొత్తం 25 మంత్రులు ఉండ‌గా ఇందులో ఇద్ద‌రు రాజీనామా చేశారు.

కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌ని వినిపిస్తున్నపేర్ల‌లో శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల‌రాజు, తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురంఎమ్మెల్యే చెల్ల‌బోయిన వేణుగోపాల కృష్ణ‌ల పేర్లు ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. బోస్‌, మోపిదేవిలు ఇద్ద‌రు బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డంతో.. ఇప్పుడు కొత్త మంత్రుల్లో కూడా ఈ సామాజిక వ‌ర్గం వారినే ఎంపిక చేయ‌నున్నారు.  పిల్లి సభాష్ త‌ర్వాత పార్టీలో శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన వేణు ఒక్క‌రే ఉన్నాడు. గ‌తంలో కూడా ఎమ్మెల్యే టికెట్ విష‌యంలో శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గంలో ఉన్న వేణుకే టికెట్ ద‌క్కింది.  దీంతో ఆశావ‌హులు ఎంత మంది ఉన్నా వేణునే ఎంపిక చేయ‌నున్నారు. సామాజిక‌వ‌ర్గం కోటాలో ఈయ‌న‌కు అదృష్టం వ‌రిస్తూనే ఉంది.

ఇక ప‌లాస ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల‌రాజ్ తొలిసారి గెలుపుతోనే మంత్రి కాబోతున్నారు

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here