ఈవిడ ఇప్పితే స్టైల్ …వాళ్లు చూపిస్తే ఫైర్

మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న‌కు ఫ్యాష‌న్ డిజైన‌ర్ చిత్రం ప్రీ లుక్ పై విప‌రీత‌మైన కోపం వ‌చ్చింది.అది కూడా ఎందుకంటే పోస్ట‌ర్ లో కాస్త వ‌ల్గారిటీ ఉంద‌ట‌.దీంతో తాన‌లాంటి ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఈ లుక్ పై కోపంగా ఉంద‌నే విష‌యాన్ని ఆవిడ చెబుతున్నారు.అది కూడా ఆవిడ‌గారు ట్విట్ట‌ర్లో ద్వారా స్పందించారు.

డైరెక్ట‌ర్ పెద్ద వంశీ డైరెక్ష‌న్లో తెర‌కెక్కుతోన్న లేడీస్ టైల‌ర్ సీక్వెల్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ చిత్రం ఇపుడు వివాదాల ప‌రంగా పాపుల‌ర్ అవుతుంది.
ఈసినిమా ప్రీ లుక్ పై మ‌హిళ‌లు ఆందోలళ‌న‌లు చేస్తున్నారు..వారిలో మ‌రీ ముఖ్యంగా మ‌న మంచు అక్క ముందు వ‌రుస‌లో ఉన్నారు.
మహిళల్ని ఇలా చూపించడం ఎప్పటికి ఆపుతాం’ అని ఆమె ట్వీట్‌ చేసి ఫ్యాష‌న్ డిజైన‌ర్ చిత్రానికి మంచి ప‌బ్లిసిటీనే తీసుకు వ‌చ్చారు.

మంచు ల‌క్ష్మి ఇచ్చిన ట్వీట్ కు నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ స్పందించారు.ఇది ఉద్ధేశపూర్వకంగా చేసినది కాదు. సినిమాలోని ఓ సన్నివేశం నుంచి ఈ పోస్టర్‌ను తీసుకున్నాం. మీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని రిప్లై ఇచ్చారు.ఇక్క‌డ మంచు ల‌క్ష్మి అనుకునేంత‌గా అంత‌టి అబ్యంత‌ర‌క‌ర స‌న్నివేశం,సీన్ ఏముంది.గ‌తంలో ఇదే మంచు ల‌క్ష్మి గారు Lakshmi Manchu Hot TV Show లో ఇచ్చిన హాట్ పోజు కంటే ఇది ఏమాత్రం పెద్ద వ‌ల్గారిటీ కానే కాద‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు.ఏం కాదంటారా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here