చద్ది వార్తను ఫ్రెష్ గా పబ్లిష్ చేసారు…ఇది మన పత్రికల స్థాయి

మీడియాలో పోటీ పెరిగాక ఎప్పటికప్పుడు కొత్త వార్తలను, అప్ డేట్స్ ఇవ్వాలన్న ఆత్రుతలో అవి వెరిఫై కూడా చేయకుండానే వెంటనే వెబ్ సైట్స్ లో పబ్లిష్ చేయటమో లేక పత్రికల్లో అచ్చు వేయటమో చేస్తున్నారు. ఆ మధ్య ఎం ఎస్ నారాయణ గారు ఇంకా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగానే పరమపదించారు అని అత్యధిక సర్కులేషన్ అని బాకాలు ఊదుకునే అతి పెద్ద న్యూస్ పేపర్ కు చెందిన ఛానల్ కూడా వార్త ప్రసారం చేసి ఆ తర్వాత నాలుక కరుచుకుంది. ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువయ్యాయి. నిన్న కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అయినట్టు దానికి సంబందించిన ఫోటోలు, వార్తలు కొన్ని వెబ్ సైట్స్వం  లో హల్చల్ చేసాయి. ఇక ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో కూడా దీని కవరేజ్ సినిమా పేజిలో బాగా వచ్చింది. నిన్న జరిగినట్టు వేసిన ఆ వార్త కథనం గురించి న్యూస్ వింటే మీరు షాక్ అవుతారు.

అసలు నిన్న కళ్యాణ్ రామ్ షూటింగ్ ఏది మొదలు పెట్టనే లేదు. పత్రికల్లో వచ్చిన ఎమెల్యే(మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) షూటింగ్ ఓపెనింగ్ ఫోటోలు ఇప్పటివి కావు. నెల రోజుల క్రితం చేసిన పూజా కార్యక్రమానికి సంబందించినవి. మరి పిఆర్ ఎవరైనా వాటిని ఇచ్చారో లేక ఉత్సాహం తట్టుకోలేక వీటిని హడావిడిగా వేసేసారో కాని మొత్తానికి చాలా హడావిడి చేసారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 9 నుంచి స్టార్ట్ కాబోతోంది. అంతలోపే నెల క్రితం ఫోటోలు పట్టుకుని నిన్నే స్టార్ట్ అయ్యింది అన్నట్టు పత్రికలు ఇచ్చిన న్యూస్ చూసి నందమూరి ఫాన్స్ సైతం షాక్ అయ్యారు. అంటే మూడు రోజుల ముందే టైం మెషిన్ లోకి వెళ్లి ఫ్యూచర్ ఫొటోస్ తీసుకొచ్చారేమో అనుకోవాలి. కాజల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 9న మొదలై నిరవధికంగా సాగుతుంది. ఇలాంటి వార్తలు ఇప్పటికి సరదాగా అనిపించినా వార్తను పబ్లిష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త గురించి హెచ్చరిస్తుంది. వెబ్ సైట్ లో ఎడిటింగ్ ఉంటుంది కాని ప్రింట్ అయ్యాక జనం చేతుల్లోకి వెళ్ళిన పేపర్ కు ఆ ఆప్షన్ ఉండదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here