ఈ ఏడాది మొత్తం అక్క‌డ రాత్రి స‌మ‌యంలో క‌ర్ఫ్యూ..

దేశంలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప‌లు రాష్ట్రాల‌లో కేసుల తీవ్ర‌త ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో మ‌రోసారి లాక్‌డౌన్ త‌ర‌హా రూల్స్ అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వాలు సిద్ద‌మ‌వుతున్నాయి. అయితే జ‌న‌జీవ‌నం స్తంబించిపోతే ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న క్ర‌మంలో కేవ‌లం ప‌లు ఆంక్ష‌లు మాత్రం అమ‌లు చేస్తున్నాయి.

ఢిల్లీ, మ‌హారాష్ట్రతో పాటు ప‌లు రాష్ట్రాల‌లో క‌రోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు క‌ఠిన నిబంద‌న‌లు అమ‌లు చేస్తున్నాయి. మాస్క్ లేనిదే బ‌య‌ట‌కు రావొద్ద‌ని చెబుతున్నారు అధికారులు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఈ ఏడాది చివరి వరకూ సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకూ నైట్ కర్ఫూ అమలులో ఉంటుందని మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31 వరకూ, లేదా తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే, తాజా ఉత్తర్వుల నుంచి నిత్వావసర సరకుల రాకపోకలు, గ్రూడ్స్ ట్రక్కులు, విధి నిర్వహణలో ఉన్న అధికారులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది.

అలాగే ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌లు, డిస్పెన్సరీలు, కెప్టిస్టులు, ఫార్మసీలను కర్ఫ్యూ ఆంక్షల నుంచి మినహాయించారు. సామాజిక, సాధారణ ఫంక్షన్లకు 20కి మించి హాజరుకారాదని కూడా ఆంక్షలు విధించింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మణిపూర్‌లో 3,245 యాక్టివ్ కేసులున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here