బ్రాందీ డైరీస్ మూవీ రివ్యూ

తెలుగు లో మలయాళం సినిమా లాంటిది ఇది . , కాదంటే తెలుగులో తమిళ సినిమా వంటిది.తెలుగులో ఇప్పటి వరకు పది వేల పైగా సినిమాలు వచ్చి ఉంటాయి , నిస్సందేహాగా వాటన్నిటికంటే బిన్నమయిన సినిమా ఇది.
బ్రాందీకి శరణు జొచ్చిన నలుగురు ముదురు తాగుబోతులు, ఒక లేత తాగు బోతు చుట్టూ తిరిగే కథ ఇది . తెలుగునాట ప్రతి పట్టణంలో కనిపించే పాత్రలే అవి ,ప్రతి పాత్ర మనకు తెలిసిన చూసిన వారి లాగే ఉంటుంది .ప్రతి దృశ్యం ,ప్రతి మాట విన్నట్టే ఉంటుంది .

కథ హీరో చుట్టూ తిరగదు ,కొన్ని జీవితాల చుట్టూ తిరుగుతుంది .ఏ పరిస్తుతుల్లో ఏ వేదనలను ,ఏ అంతర్ ఘర్షణలను భరించడానికి ఒకరు బ్రాంధిని ఆశ్రయిస్తారో వివరించే సినిమా ఇది.తెలుగులో వచ్చిన మొదటి ఇండిపెండెంట్ పెద్ద సినిమా మాదని దర్శక నిర్మాతలు చెప్తున్నారు .
అధికారం ,ఆస్తి, మందు, మగువ ,డ్రగ్స్, స్మోకింగ్, డబ్బు లాగే బ్రాంధి కూడా ,కానీ మన వారు బ్రాందీనే అభాసు పాలు చేస్తుంటారన్న దర్శకుడి ఆక్షేపణ మనకు సినిమాలో వినపడుతుంది . ఆసక్తి గొలిపే సీన్లు,ట్విస్టులు సినిమాలో అనేకం అన్నాయి.

తక్కువ బడ్జెట్ సినిమానే కానీ పెద్ద బడ్జెట్ సినిమాకు ఎంత మాత్రం తీసి పోదు.నటీనటులు,లొకేషన్స్ ,కెమెరా,బ్యాక్ గ్రౌండ్ మ్యూసిక్ ,పాటలు ,ఎడిటింగ్, అన్ని డిపార్ట్‌మెంట్ల పని వాటి కోఆర్డినేషన్ చాలా బాగుంది.
సృజన కొత్తదనం పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడు – రచయిత పోటాపోటీగా పని చేసిన తీరు అద్భుతంగా ఉంది.ఈ సినిమాకు ఆ ఇద్దరు ఒక్కరే కావడం విశేషం . కావల్సిన మోతాదులోనే మెలోడ్రామా ఉంది . మాటల్లో అసాదారణ లోతు ఉంది . తాత్వికత ను నింపుకున్న తేలిక డైలాగులు సన్నివేశాలు సినిమాకు చక్కటి జిగిని అంధించాయి.
యీ సినిమాలో పెద్ద నటులు ,పాత నటులు ఎవరూ లేరు ,అయినా ఆ విషయం మనకు తెలియనే తెలియదు.నటులంతా కొత్తవారే. అసలు సినిమాలో పాత్రలే కనిపించవు, అందరూ జీవిస్తున్నట్లే ఉంది.
సినిమాటోగ్రాఫర్ యీశ్వర్ తంగవేల్ పనిలో లోపం లేదు .పాటలు పెంచల్‌దాస్ రాశాడు.

‘యెందుకో యీ మోహమూ’ అనేది రాయలసీమ ఫోక్ ఫాం లో అన్నమయ్య తత్వాన్నీ ఇముడ్చుకున్న పాట సోషల్ మీడియా మిలియన్ క్లిక్ లను ఎప్పుడో దాటేసింది .సినిమాలో ఉన్న మూడు పాటలూ భాగున్నాయి .అవి కథలో ఇమిడి పోయాయి. సంగీత దర్శకుడు ప్రకాష్ రెక్స్ సృజన మనని సినీమా చూశాక కూడా వెంటాడుతుంది.
‘బ్రాందీ డైరీస్ ‘ సమ కాలీన దృశ్య కథనం.

Rating : 3.25 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here