దసరా రోజు మీ ‘ఇంటికి’ వస్తున్న భీష్మ..!

‘లై’, ‘ఛల్‌ మోహన రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి వరుస పరాజయాల తర్వాత నితిన్‌ హీరోగా వచ్చిన ‘భీష్మ’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మహాశివరాత్రి కానుకగా గత ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నితిన్‌, రష్మికల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆర్గానిక్‌ వ్యవసాయం అనే కాన్సెప్ట్‌ తో పాటు ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్న భీష్మ.. ఇప్పుడు బుల్లి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. దసరా కానుకగా జెమినీ టీవీలో అక్టోబర్‌ 25 సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రసారం కానుంది. తాజాగా జెమినీ టీవీ ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. ‘మీ దసరా పండుగ సంతోషాన్ని రెట్టింపు చేయడానికి భీష్మ వచ్చేస్తున్నాడు మీరు రెడీ గా ఉండండి’ అంటూ పోస్ట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here