8 నెలల గర్భంతో ఉన్న కోడలిపై అత్త కిరాతకం.. కిరోసిన్ పోసి నిప్పంటించి..

వరకట్న వేధింపులకు నిండు గర్భిణి బలైంది. అదనపు కట్నం తేలేదన్న కోపంతో అత్తింటి వారు కిరోసిన్ పోసి నిప్పంటించిన అమానుష ఘటన వెలుగుచూసింది. గర్భంతో ఉన్న భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కట్టుకున్న భర్తే తల్లితో కలసి అమానుషానికి దిగాడు. కడుపుపై కాలిన గాయాలతో నరకం అనుభవించిన వివాహిత బిడ్డను ప్రసవించి తాను ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. కంటనీరు తెప్పిస్తున్న ఈ అత్యంత దారుణ ఘటన తమిళనాడులోని జిల్లాలో చోటుచేసుకుంది.

తంజావూరు పరిధిలోని సూరియంపట్టి గ్రామానికి చెందిన మురుగనాథన్(25)కి పొట్టవచ్చావడి గ్రామానికి చెందిన గోవిందరాజ్ కుమార్తె సంగీత(20)తో ఏడాదిన్నర కిందట వివాహమైంది. పెళ్లైన కొద్దిరోజులు బాగానే ఉన్న అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. భర్త, మురుగనాథన్, అత్త పుష్పవల్లి(55) అదనపు కట్నం తేవాలంటూ నిత్యం వేధింపులకు పాల్పడేవారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.

Also Read:

ఎనిమిది నెలల గర్భంతో ఉన్న కోడలిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అత్త పుష్పవల్లి, కొడుకుతో కలసి దారుణానికి దిగింది. సాటి మహిళ అన్న కనీస సానుభూతి కూడా లేకుండా నిండు గర్భిణి అయిన కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఒంటికి నిప్పంటుకుని సంగీత మంటల్లో కాలిపోయింది. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు పరుగున వచ్చి చూసేసరికి కడుపుపై కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే భర్త మురుగునాథన్ ఆమెను ఆస్పత్రికి తరలించాడు.

కాలిన గాయాలతో నరకం అనుభవించిన సంగీత అతి కష్టమ్మీద మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ తీవ్రగాయాలతో ఈలోకాన్ని విడిచిపెట్టింది. బిడ్డను ప్రసవించిన అనంతరం ఆమె కన్నుమూసింది. కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి సంగీత వద్ద స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. తన అత్త పుష్పవల్లి కిరోసిన్ పోసి నిప్పంటించిందని వాంగ్మూలం ఇచ్చిన సంగీత.. బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి అత్త, భర్తని అరెస్టు చేసి జైలుకి పంపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here