37వేలు దాటికి కరోనా కేసులు.. కోలుకున్న 10వేల మంది: కేరళలో నిన్న జీరో కేసులు!

దేశంలో మహమ్మారి తీవత్ర కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో దాదాపు 2వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 37 వేలు దాటింది. మరో 77 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,223కి చేరింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే 11వేల మంది వైరస్ బారినపడ్డారు. శనివారం ఏకంగా 1,008 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒక్క ముంబైలోనే 750పైగా కేసులు నమోదయ్యాయి.

దేశ వ్యాప్తంగా వివిధ ఇప్పటివరకూ 10వేల మంది కోలుకోగా, మొత్తం కేసుల్లో ఇది 25.63 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రెండు వారాల కిందట రికవరీ రేటు 13% ఉండగా, ఇప్పుడది గణనీయంగా పెరగడం విశేషం. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ముందు… కేసులు రెట్టింపు కావడానికి సగటున 3.4 రోజుల సమయం పడితే, ఇప్పుడు అందుకు 11 రోజులు పడుతున్నట్టు ఆరోగ్యశాఖ వివరించింది.

మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 1,008 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. 106 మంది బాధితులు ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి కాగా, 26 మంది మృతిచెందారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా సంభవించిన మరణాల్లోనూ అత్యధికం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మొత్తం 485 మంది ప్రాణాలు కోల్పోగా.. ముంబయి మహా నగరంలో296 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పాజిటివ్ మొత్తం కేసుల సంఖ్య 7,825కు చేరింది. శుక్రవారం గుజరాత్‌లో 17 మంది, పశ్చిమ బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఏడుగురు చొప్పున, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు మృతిచెందారు.

ఢిల్లీలో కొత్తగా 223 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా… ఢిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దులను హరియాణా పొలీసులు మూసివేశారు. అత్యవసర సేవలు అందించేవారిని మినహా మరెవర్నీ అనుమతించలేదు. పాసులున్న చాలామంది వాహనదారులను వెనక్కి పంపేశారు. కాగా, గోవాలోని రెండు జిల్లాలనూ కేంద్రం గ్రీన్‌జోన్‌గా ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలంగాణలో పరిస్థితి కాస్త సానుకూలంగా ఉంది. గత 24 గంటల్లో ఇక్కడ కేవలం 6 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,044కి చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రం మహమ్మారి ఉద్ధృతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 60 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 1463కి పెరిగింది. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 33కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,02,460 మందికి పరీక్షలు నిర్వహించారు.

గుజరాత్‌లో 4,721, ఢిల్లీ 3,738, మధ్యప్రదేశ్ 2,715, రాజస్థాన్ 2,666, తమిళనాడు 2,526, ఉత్తరప్రదేశ్ 2,328, ఆంధ్రప్రదేశ్ 1,463, తెలంగాణ 1,044, పశ్చిమ్ బెంగాల్ 795, జమ్మూ కశ్మీర్ 639, కర్ణాటక 589, పంజాబ్ 585, కేరళ 498,బీహార్ 466, హర్యానా 357, ఒడిశా 154,ఝార్ఖండ్ 113, చండీగఢ్ 88, ఉత్తరాఖండ్ 57, అసోం 43 మందికి వైరస్ సోకింది. అయితే, శుక్రవారం కేరళలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాకపోవడం విశేషం.

మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కరోనా మరణాలు గుజరాత్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 236గా నమోదయ్యాయి. తర్వాతి మధ్యప్రదేశ్ (145), రాజస్థాన్ (62), ఢిల్లీ (61), ఉత్తరప్రదేశ్ (42), ఆంధ్రప్రదేశ్(33), పశ్చిమ్ బెంగాల్ (33), తమిళనాడు (28), తెలంగాణ (28), కేరళ (22), పంజాబ్ (20) మంది ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here