120 కోట్ల డోసుల ర‌ష్యా వ్యాక్సిన్ బుక్‌.. ఇందులో భార‌త్ ఎంత‌

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నిపెట్టి ర‌ష్యా సంచ‌ల‌నం సృష్టించింద‌ని చెప్పొచ్చు. అయితే వ్యాక్సిన్ త‌యారు చేసిన‌ప్ప‌టి నుంచి ర‌ష్యాకు డిమాండ్ పెరిగింది. ప్ర‌పంచ దేశాలు దీన్ని బుక్ చేసుకునేందుకు క్యూ క‌డుతున్నాయి.

ర‌ష్యా వ్యాక్సిన్ స్నుతిక్ వికి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఇప్ప‌టికే రెండు ద‌శ‌ల ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్‌పై మొద‌ట్లో ప‌లు అనుమానాలు బ‌య‌ట‌కు వ‌చ్చినా చివ‌ర‌కు వ్యాక్సిన్ మంచిపేరు తెచ్చుకుంది. చివ‌రి ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే 120 కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం విన‌తులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్ర‌పంచంలోని 20 దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌ని స‌మాచారం.

అయితే రష్యా వ్యాక్సిన్ వ‌స్తే ముందుగా ఆదేశంలోని వారంద‌ర‌కీ ఇవ్వ‌నుంది. ఆ త‌ర్వాతే ఇది ప్ర‌పంచ దేశాల‌కు అందించ‌నుంది. అయితే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో వివిధ దేశాల వారికి కూడా వ్యాక్సిన్ డోసులు ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఇండియాలో డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థ‌తో క్లినికల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మ‌న‌దేశానికి ప‌ది కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.

ర‌ష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ స‌మాచారం ప్ర‌కారం ఈ ఏడాది చివ‌రి నాటికి 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ సిద్దం చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో 3 కోట్ల డోసులు మాత్ర‌మే ర‌ష్యాలో రెడీ అవుతుండ‌గా.. మిగతా వ‌న్నీ ఇత‌ర దేశాల్లో రెడీ అవుతున్నాయి. వీటిలో ఇండియా, బ్రెజిల్, ద‌క్షిణ‌కొరియా, సౌదీ అరేబియా, ట‌ర్కీ, క్యూబాలలో త‌యార‌వ్వ‌నున్నాయి. ఈ వ్యాక్సిన్ మూడో ద‌శ ప్ర‌యోగాలు 40 వేల మందిపై నిర్వ‌హిస్తున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ఈ వ్యాక్సిన్ డిమాండ్ ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here