మంగళసూత్రం, కాలి మెట్టెలు తీసి ప‌రీక్ష రాయించారు..

భార‌తీయ పెళ్లైన మ‌హిళ‌కు అత్యంత ప్రాధాన్య‌మైన‌ది మంగ‌ళ‌సూత్రం, కాళ్ల‌కు మెట్టెలు. భ‌ర్త చ‌నిపోతే త‌ప్ప ఈ రెండింటినీ భార్య తీసి ప‌క్క‌న పెట్ట‌దు. అయితే ఇటీవ‌ల ఓ ప‌రీక్ష కేంద్రంలోకి అనుమ‌తించే స‌మ‌యంలో ఇవి రెండు తీసి ప‌క్కన పెట్టిన త‌ర్వాత లోప‌లికి అనుమ‌తించారు. ఇప్పుడిది వివాదాస్ప‌దంగా మారింది.

ప్రాధాన్య‌త క‌లిగిన నీట్ ప‌రీక్ష‌కు సంబంధించిన నిబంధ‌న‌ల్లో భాగంగా ఇది జ‌రిగింది.  వైద్యకోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయి నీట్‌ పరీక్ష ఇటీవల జరిగింది. ఈ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు కఠిన నిబంధనలు అమలుచేశారు. పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోనే పెన్ను ఇస్తారు. విద్యార్థులు ఏ ప‌రిక‌రాన్ని బ‌య‌టి నుంచి లోపలికి తీసుకెళ్లేందుకు అనుమ‌తులు లేవు. ఇవ‌న్నీ నీట్ నిబంధ‌న‌ల్లో ఉన్నాయంట‌.

అయితే మహిళలు ప్రాణపదంగా భావించే మంగళసూత్రం, కాలి మట్టెలను కూడా అధికారులు బలవంతంగా తీయించారు. ఆ త‌ర్వాత‌నే ప‌రీక్ష కేంద్రంలోకి అనుమ‌తించారు. అయితే ఇది ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.  వివాహమైన మహిళలు పరీక్ష రాసేందుకు వచ్చిన సమయంలో మంగళసూత్రం, కాలి మట్టెలు బలవంతంగా తొలగించడం రాజ్యాంగానికి వ్యతిరేకమని అంతా మండిప‌డుతున్ఆన‌రు. ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిష‌న్ వేశారు.  నీట్‌ నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ప‌రీక్ష‌ల‌కు నిబంధ‌న‌లు ఉండాలి కానీ మంగ‌ళ‌సూత్రం, కాలి మెట్టెలు తీసేయాల‌న్న నిబంధ‌న‌లు ఏంటని ప‌బ్లిక్ మండిప‌డుతున్నారు. ప‌రీక్ష కంటే మంగ‌ళ‌సూత్రానికి మ‌హిళ‌లు ఎక్క‌వ ప్రాధాన్య‌త ఇస్తార‌ని చెబుతున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యా ర్థులు ధరించిన ఆభరణాలు తొలగించాలని ఒత్తిడి చేయరాదని పిటిష‌న్ లో పేర్కొన్నారు. సీసీ కెమె రాలు ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఇలాంటి నిర్భంధ నిబంధనలు చట్టవ్యతి రేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిబందనలు చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.  మ‌రి ఈ విష‌యంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. సెల్‌ఫోన్‌, బ్లూటూత్‌, పెన్‌ డ్రైవ్‌, చేతి గడియారం, ల్యాప్‌టాప్‌, కెమెరా తదితరాలను కూడా ప‌రీక్ష హాలులోకి అనుంతించ‌రు. దీంతో పాటు సాఫ్ట్‌ కలర్‌ దుస్తులనే విద్యార్థులు ధరించాలి,  టీ-షర్ట్‌లు వేసుకోకూడదని నిబంధ‌న‌లు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here