అచ్చెన్నాయుడు కు అధ్యక్ష పదవి రాకుండా చేస్తోంది ఎవరు…?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలల్లో తెలుగుదేశం పార్టీ చెరగని ముద్ర వేసుకుందని చెప్పొచ్చు. అయితే అదంతా గతంలోనే.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. తాజాగా ఏపీలో ఆ పార్టీ తీవ్ర గడ్డు పతిస్థితులు ఎదుర్కొంటోంది. సొంత పార్టీ నేతలే చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు.

ఇటీవల టిడిపి ఏపీ అధ్యక్ష పదవి విషయంలో పలు కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ అధ్యక్షుడుగా రాబోతున్నాడని అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈయన వైపే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఈనెల 27వ తేదీన దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తోందని ఇప్పటికే మార్మోగుతోంది. అయితే ఇదే సమయంలో దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని కాదని ఇంకో నేతను అధ్యక్షుడుగా చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు బీద రవిచంద్ర యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది.

 

అచ్చెన్నాయుడు కాకుండా ఈయనకే అధ్యక్ష పదని దక్కాలని టిడిపిలో సీనియర్ నాయకులు వర్గం ప్లాన్ చేస్తోందట. కావాలంటే అచెన్న కుటుంబంలో రామ్మోహన్ నాయుడుకు తెలుగు యువత అధ్యక్ష పదవి ఇవ్వండని సలహాలు ఇటున్నారట. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో బీదకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ ఇప్పటికే శ్రీకాకుళంలో బలంగా ఉందని.. బలహీనంగా ఉన్న నెల్లూరులోని నేతకు ఇవ్వాలని పట్టుపడుతున్నారని సమాచారం. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన వస్తుందనుకుంటున్న అధ్యక్ష పదవి ప్రకటన వాయిదా పడుతుందన్న వార్తలు బయటకొస్తున్నాయి. ఇదే జరిగితే పార్టీలో చంద్రబాబు వ్యతిరేక గళం మొదలైనట్లేనని రాజకీయ వర్గాల్లో టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here