సీరియల్ యాక్టర్‌గా మారిన హీరో..

హ్యాండ్‌సమ్ హీరో ఆకాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. సూపర్ హిట్ మూవీ ‘ఆనందం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్.. ఆ తరవాత సోలో హీరోగా వరుసపెట్టి సినిమాలు చేశారు. కానీ, హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. దీంతో, ఆయన తనను పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లిపోయారు. అక్కడ హీరోగా చాలా సినిమాలు చేశారు. అయినా కలిసి రాలేదు. దీంతో ఆ తరవాత ఆకాష్ క్యరెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు.

ప్రస్తుతం ఆకాష్ సినిమా కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. దీంతో ఆయన టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు.ఆకాష్ నటించిన కన్నడ సీరియల్ ‘జోతాయి.. జోతాయల్లీ’ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఇదే సీరియల్ తమిళంలో ‘నీతానై ఎంతన్ పొన్వసంతన్’ పేరుతో జీ-తమిళ్‌లో డైలీ సీరియల్‌గా ప్రసారమవుతూ అక్కడి బుల్లితెర ప్రేక్షకులకు ఆకాష్‌ను దగ్గర చేసింది. ఈ సీరియల్‌ను తెలుగులో ‘ప్రేమ ఎంత మధురం’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మరోవైపు, ఆకాష్ నటించిన అయిదు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘ఏ-క్యూబ్’ పేరుతో ఒక మూవీ యాప్‌ను కూడా సిద్ధం చేసుకున్న ఆకాష్.. ‘అందాల రాక్షసుడు’గా తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here