సీఆర్‌పీఎఫ్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. 15 మందికి పాజిటివ్‌

క‌రోనా వైర‌స్ దేశవ్యాప్తంగా చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. తాజాగా ఇది ర‌క్ష‌ణ రంగ సిబ్బందికి కూడా సోకిన‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 15 మంది సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్) సిబ్బందికి (కోవిడ్‌-19) సోకిందని అధికారులు వెల్ల‌డించారు. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది అని తెలుస్తోంది. దీంతో ఈ యూనిట్‌లో మొత్తం కోవిడ్‌ బాధితుల సంఖ్య 24కి పెరిగింది. గ‌తంలో ఈ బెటాలియ‌న్‌లో తొమ్మిది మందికి కరోనా సోకింది. బాధితుల్ని మండ్వాలి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే మ‌రికొంత‌మంది సైనికుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సిన అవ‌స‌ర‌ముంది.

Must Read:

మ‌రోవైపు ఇక హెడ్ కానిస్టేబుల్ నుంచి క‌రోనా సోకింద‌ని అధికారులు అనుమానిస్తున్నారు. గత వారం బెటాలియన్‌కు వచ్చిన అత‌ని‌ నుంచి కోవిడ్‌-19 సోకిందని భావిస్తున్నారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో అత‌డు నర్సింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సెలవులో ఢిల్లీ స‌మీపంలోని నొయిడాకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా అతడికి పరీక్షలు చేయగా ఇటీవ‌లే కరోనా సోకిందని తేలింది. ఇక ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగ పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 2900కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. 54 మంది మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here