విదేశాల్లో ప్రభాస్‌ క్రేజ్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ప్రభాస్‌.. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడీ పేరు ఓ సంచలనం. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టినరోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకొని ప్రభాస్‌ అభిమానులు ఇప్పుడే సోషల్‌ మీడియాలో హల్చల్‌ మొదలుపెట్టారు. ఇక ప్రభాస్‌ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూడు చిత్రాల దర్శకనిర్మాతలు కూడా ప్రభాస్‌ పుట్టినరోజున అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసే పనిలో పడ్డారు.

ఇదిలా ఉంటే విదేశాల్లోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌కు ఆయన పుట్టిన రోజున బాహుబలి2 స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేస్తుండడం విశేషం. జపాన్‌తో పాటు అమెరికాలోని పలు నగరాల్లో ప్రభాస్‌ పుట్టినరోజున ప్రత్యేకంగా అక్కడి థియేటర్స్‌లో సినిమాను ప్రదర్శించనున్నారు. దీంతో ప్రభాస్‌ ఖ్యాతి ఖండతరాలు దాటిందని ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. అక్టోబర్‌ 23న రాధేశ్యామ్‌ నుంచి రాబోయే సర్‌ప్రైజ్‌ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురొచూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here