రష్మిక ఆమ్లెట్ ఎలా చేసిందో చూశారా.?

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సినీ తారలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గుతోంది. ఒకప్పుడు తమ అభిమాన తారల విషయాలు తెలుసుకోవాలంటే కేవలం వారు టీవీలకు, పేపర్లకు ఇచ్చే ఇంటర్వ్యూలే ఆధారం. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. సెలిబ్రిటీలు తమ వ్యక్తిగత వివరాలను నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కొందరు నటీమణులు వంటింట్లో గరిట తిప్పుతోన్న వీడియోలను కూడా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. టేస్టీ టేస్టీ వంటకాలను అభిమానులకు పరిచయం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా అందాల నటి రష్మిక మందన్న ఆమ్లెట్ ఎలా చేయాలో చేసి చూపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘ఒకసారి ఆమ్లెట్‌ గురించి ఓ పోస్ట్‌ చేయగా అప్పటి నుంచి నా ఫ్రెండ్స్‌ ఆమ్లెట్‌కు సంబంధించి వీడియోను చేయమని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో’ అంటూ పోస్ట్‌ చేసింది. సింపుల్‌ స్టెప్స్‌ తో రష్మిక చేసిన ఆమ్లెట్‌ను మీరూ ఓసారి ట్రై చేయండి మరి.

View this post on Instagram

Try it.. and let me know how you like it. 💛

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here