ముస్లింల దగ్గర కూరగాయలు కొనొద్దు: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు, నడ్డా సీరియస్!

కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వ్యాపారుల నుంచి కూరగాయలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని బర్హాజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన.. తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. ఆయన మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ విషయమై మీడియా వివరణ కోరగా.. ‘ఇటీవలే నా నియోజకవర్గానికి వెళ్లాను. ముస్లిం కూరగాయల వ్యాపారులు కూరగాయలపై ఉమ్మి రాస్తున్నారని ప్రజలు నాకు చెప్పారు. దీంతో అలాంటి వారి దగ్గర్నుంచి కూరగాయలు కొనుగోలు చేయకుండా ఉండటం మినహా.. ఈ విషయంలో నేనేమీ చేయాలేనని చెప్పాను. ఓ ఎమ్మెల్యే అంతకు మించి ఏం చెప్పగలడు. నేను అలా అనడం తప్పా?’ అని తివారీ ఎదురు ప్రశ్నించారు.

ఒవైసీ లాంటి నేతలు హిందువులను తిడితే ఎవరూ అడ్డుకోరు. కానీ ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకు సలహా ఇస్తే మాత్రం నానాయాగీ చేస్తారంటూ తివారీ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని తివారీకి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో విచారణ జరపాలని బీజేపీ యూపీ విభాగాన్ని ఆయన ఆదేశించారు. ఇలాంటి వ్యాఖ్యలను చేయొద్దని పార్టీ నేతలను నడ్డా హెచ్చరించారు.

కరోనాకు కులం, మతం, జాతి, రంగు, భాష లాంటి బేధాలేవీ లేవని, దానికి సరిహద్దులు కూడా లేవని ఇటీవలే ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. మాస్కులు ధరిస్తూ.. అందరం కలిసికట్టుగా కరోనాపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here