మీరు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

80శాతం ప్రజల సంతృప్తే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని చేస్తుంటే…. టీడీపీ సీనియర్లు మాత్రం ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, మాగంటి బాబు వ్యవహార శైలిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలుంటే చెప్పి చేయించుకోవాలే కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

ఇటు మాగంటి మాటలపైనా చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ఏదో నోటికొచ్చినట్లు క్యాజువల్‌గా మాట్లాడితే… నష్టం జరిగేది టీడీపీకేనంటూ హెచ్చరించారు. పార్టీ లీడర్లు ఎవరైనా క్రమశిక్షణతో ఉండాలన్నారు. క్రమశిక్షణా రాహిత్యం పార్టీకే కాదు…. సమాజానికి కూడా నష్టమంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. అప్పుడే పార్టీ అనుకున్న స్థాయికి వెళ్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here