మిరాకిల్ బేబీ: ఆరు నెలలకే కరోనాపై విజయం.. డాక్టర్ల ఆనంద భాష్పాలు, కారణమిదే!

ఆ పసికందు పుట్టిన రెండు నెలలకే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆరు నెలలకే కరోనా బారిన పడింది. పుట్టిన ఆరు నెలలకే రెండు ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ… ఆ చిన్నారి గెలిచింది, మృత్యుంజయురాలు అనిపించుకుంది. బ్రిటన్ వాసులు ఆ పాపను ‘మిరాకిల్ బేబీ’ అని పిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

లివర్‌పూల్‌కు చెందిన ఎరిన్ బేట్స్‌కు పుట్టుకతోనే గుండె సంబంధ సమస్యలు ఉన్నాయి. దీంతో గత ఏడాది డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అప్పటికి ఆ పాప వయసు రెండు నెలలు మాత్రమే. అలా గుండె జబ్బు నుంచి కోలుకుందో లేదో.. కరోనా మహమ్మారి బారిన పడింది. దీంతో ఆ చిన్నారి ఆరోగ్యం విషయమై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆల్డెర హే చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని హై డిపెండెన్సీ యూనిట్‌లో ఉంచి ఆ పాపకు చికిత్స అందించారు. ఆ చిన్నారి ముక్కులోకి ఆక్సిజన్ పైపులు వేసిన ఫొటోను ఆమె తల్లిండ్రులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. చూసిన వారంతా అయ్యో పాపం అనుకున్నారు.

ఆ పసికందు కొద్ది రోజుల్లోనే కరోనాను జయించింది. దీంతో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఆ చిన్నారికి చికిత్స అందించిన డాక్టర్లయితే ‘గార్డ్ ఆఫ్ హానర్’ ద్వారా ఆ పాపకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ చేశారు. ఈ వీడియోను ఆల్డెర్ హాస్పిటల్ ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here