మానవ మృగాల పైశాచికం.. అన్నని బావిలో తోసేసి.. చెల్లెలిని లాక్కెళ్లి దారుణంగా..

మానవ మృగాలు రెచ్చిపోయాయి. బైక్‌పై వెళ్తున్న అన్నాచెల్లెళ్లపై పైశాచికంగా విరుచుకుపడ్డాయి. అన్నని దారుణంగా కొట్టి బావిలో తోసేసి చెల్లెలిని తోడేళ్లలా వెంటాడాయి. సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డాయి. ఈ అత్యంత అమానుష సంఘటన మధ్యప్రదేశ్‌లోని వెలుగుచూసింది.

బేతుల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి(18) ఆమె అన్న(21) బైక్‌లో పెట్రోల్ కోసం సమీపంలోని పధార్ పట్టణానికి వెళ్లారు. బంకులో పెట్రోల్ కొట్టించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో ఏడుగురు దుండగులు బైక్‌ని అడ్డగించారు. యువతి అన్నపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా కొట్టి అక్కడే బావిలో పడేశారు.

Also Read:

అనంతరం యువతిని సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి చేశారు. ఏడుగురు మృగాళ్లు పైశాచికంగా పశువాంచ తీర్చుకోవడంతో ఆమె స్పృహ‌ కోల్పోయింది. టౌన్‌కి వెళ్లిన అన్నా చెల్లెళ్లు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి వెతకడంతో దారుణ స్థితిలో కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అన్నాచెల్లెళ్లను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నాు. యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు బేతుల్ జిల్లా ఎస్పీ డీఎస్ బదోరియా తెలిపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here