మహిళా హోంగార్డుకి ఆ వేధింపులు.. ఎస్సై కీచకపర్వం.!

లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మహిళా హోంగార్డు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. యూపీలోని అలీగఢ్‌ జిల్లా ఇగ్లాస్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న లేడీ హోంగార్డు తనను ఎస్సై వేధిస్తున్నాడని ఎస్‌ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. రమ్మంటూ వేధిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది.

ఈ నెల 24న బ్యాంకు వద్ద విధులు నిర్వర్తిస్తుండగా ఎస్సై అక్కడకు వచ్చారని.. డ్యూటీ ఎక్కడ వేశారంటూ అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. అనంతరం తనతో రమ్మని పిలిచారని.. తాను నిరాకరించడంతో చేయిపట్టుకుని లాక్కెళ్లేందుకు యత్నించాడని తెలిపింది. కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి తనను బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని పేర్కొంది.

Also Read:

లైంగిక వేధింపులకు గురిచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు చేసి నివేదిక పంపాల్సిందిగా ఇగ్లాస్ పోలీస్ స్టేషన్ సీఐని ఆదేశించారు. అయితే హోంగార్డు నిరాధార ఆరోపణలు చేస్తోందని.. డ్యూటీకి వెళ్లడం ఇష్టం లేకనే ఆరోపణలు చేసిందని సీఐ పరశురాం సింగ్ అన్నారు. మహిళ కాబట్టి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందని.. ఈ మేరకు ఎస్పీకి నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here