భర్తని వదిలేసి ప్రియుడితో సహజీవనం.. కన్నవారే ఛీ కొట్టడంతో..

వివాహేతర సంబంధాలు భార్యాభర్తల బంధాన్ని.. కుటుంబ బాంధవ్యాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తోందీ ఘటన. పడక సుఖం కోసం పరితపించి కట్టుకున్న భర్తని.. కన్నబిడ్డలను వదిలి వెళ్లిన మహిళ ప్రియుడితో బిడ్డకి జన్మనిచ్చింది. ఆమెను ఆదరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం.. చివరికి కన్నవారు సైతం చీదరించుకోవడంతో దిక్కుతోచని స్థితిలో బావిలో దూకేసి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

రోజుల వయస్సున్న పసికందుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన జిల్లా ఉత్తిరమెరూర్‌లో జరిగింది. కాంచీపురం జిల్లాకు చెందిన మహాలక్ష్మి(38)కి అదే ప్రాంతానికి చెందిన జగన్‌తో వివాహమైంది. వారికి ముగ్గురు కొడుకులు సంతానం. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేసే మహాలక్ష్మి తన సహోద్యోగితో పెట్టుకుంది.

Also Read:

ప్రియుడి మోజులో భర్త, బిడ్డలను వదిలేసి అతనితో వెళ్లిపోయింది. రెండేళ్లుగా సహజీవనం కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రియుడితో గర్భం దాల్చింది. చెంగల్‌పేట్‌లోని ఓ ఆస్పత్రిలో 12 రోజుల కిందట ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పచ్చి బాలింతగా ఉన్న ఆమె పసికందును తీసుకుని పుట్టింటికి వెళ్లగా ఆమెను ఛీకొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో మనస్థాపానికి గురైన మహాలక్ష్మి ఊరికి సమీపంలోని వ్యవసాయ బావిలో బిడ్డతో సహా దూకేసింది.

గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. మహాలక్ష్మిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఆమె రోజుల వయసున్న కూతురు ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పసికందు మరణానికి కారణమైన మహాలక్ష్మిపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆమె ముగ్గురు కొడుకులు తండ్రితోనే ఉంటున్నట్లు సమాచారం.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here