బాబ్రీ మసీదు కేసులో కీలక మలుపు

అ యోధ్యలో రామమందిర నిర్మాణానికి అడుగులు పడుతున్న వేళ.. కీలక మలుపునకు తిరిగింది. ఈ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. బీజేపీ అగ్ర నేతలు ఉన్న ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌, గిరిరాజ్‌ కిషోర్‌ సహా నాటి యూపీ సీఎం కళ్యాణ్‌ సింగ్‌ తదితరులు ఈ కేసులో ఉన్నారు. కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు 28 ఏళ్లుగా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

అయోధ్య వివాదంపై తుది తీర్పును వెలువరిస్తూ.. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘1992 డిసెంబర్‌ 6న కరసేవకులు వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్‌ మూలాలను దెబ్బతీయడానికి ‍ప్రయత్నించారు. ఈ అంశంలో ముస్లిం వర్గాలకు కచ్చితంగా న్యాయం జరగాల్సిందే’ అని రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Also Read:

Must Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here